Wednesday, February 9, 2011

తిరపతయ్య బోడిగుండు కథ

తిరపతయ్య సిని రంగం లో అడుగు పెట్టేటప్పుడు చేతిలో 'కాలణా ' లేదు అని చెప్పుకోలేడు గాని . ఆ పై అదృష్టం కలసి వచ్చింది. స్వయం కృషి తో పై పై కి ఎదిగాడు. విలన్ గా, హీరో గా , క్యారెక్టర్ ఆక్టర్ గా ఇలా ఇదంటూ లేకుండా అట్లా మాస్ హీరో గాను ఇట్లా క్లాస్స్ హీరో గాను పేరు గాంచాడు.

తన జీవితం మొత్తం ఈ కళామ తల్లికేనా ? తన పేరు సార్థకం అయ్యేదేలా? అన్న సందేహం అతనికి ఓ రోజు కలిగింది. తిరపతయ్య అని తన వాళ్ళు ఊరికే పేరు పెట్టి ఉండరని అతని మనసుకి తట్టింది. ఆలోచించాడు. కొండ పైన దేవర కోసం అందరికి బోడిగుండు కొట్టేందు కు చాలామంది ఉండనే ఉన్నారు. కాని నిజం గా వీళ్ళు 'త్రికరణ శుద్ధిగా అందరికి క్షవరం చేస్తున్నారా ? అబ్బే లేదే అని వాపోయాడు.

ఆ రోజు తెల్లారి లేస్తూనే తన తమ్ముణ్ణి పిలచి - 'ఒరేయ్ అబ్బిగా నేను అందరికి బోడి గుండు కొట్టాలని అనుకుంటున్నాను రా ' అన్నాడు. తమ్ముడు గాలి కన్నా వేగం ! అన్న ఆ అంటే తమ్ముడు సై అనే రకం !

' అన్నోయ్ - దానికేముంది బ్రహ్మాండం గా మనమే ఒక బోడిగుండు దుకాణం పెట్టేద్దాం ' అన్నాడు. అనడమే కాదు - వెంటనే కార్య రంగం లో కి దిగాడు. త్రికరణ శుద్ధి గా ఎవరెవ్వరు అందరికి బోడి గుండు కొట్టాలని అనుకుంటూ న్నారో వాళ్ళంతా తనని వెంటనే కలవాలని తనకో మెగా ప్లాన్ ఉందని చాటేశాడు.

అక్కడ కొండ పై ఉన్న బోడి గుండు సంఘం వాళ్లకి బెరుకు పుట్టిన మాట వాస్తవం . అయినా వాళ్ళు బింకం వదలలే.

'ఆ వీడు పేరుకే తిరపతయ్య - బోడిగుండు కోడతానంటే అందరు వీడి దగ్గరికి ఎందుకు వెళతారు? తర తరాలు గా కొండ దేవరకి 'తల' 'నీలాలు' అర్పించుకున్న అర్భకులు ఇవ్వాళ కొత్త సెలూన్ వస్తే దానికి వెళ్తారా ఎవరైనా? ' అని నిబ్బరం గా ఉన్దామానుకున్నారు.

అందులో తల పండినవాళ్ళు కొంత మంది ముందాలోచన చేసి ఎందుకైనా మంచిది - ఈ మధ్య కొండ దేవర పేరు చాల దిగ జారి పోతోంది - కాబట్టి - ఈ తిరపతయ్య ని వలలో వేసుకుని వాణ్ని తమ బోడి గుండు సంఘం లో నే చేరి అందరికి బోడి గుండు కొట్టు కో రా అబ్బిగా - నీకు ముందస్తే ఎలాంటి అనుభవం లేదాయెను - బోడి గుండు కొట్టడం అంత సులువైన పని కాదు - దానికి మెలుకువలు తెలియాలే - కొండ దేవర దీవెనలు ఉండాలే ' అని బుజ్జగించి చూసేరు. !

చత్ - బోడి గుండు కొట్టడానికి అనుభవం దేనికి - నాకున్న పేరు చాలు - తిరపతయ్య బోడిగుండు కొట్ట లేక పోవటం ఏమిటి? ' నా దుకాణం మీ కొండ మీదే కాకుంటే - కొండ కిందే పెడతాను ' అని శపథం చేసి - తమ్ముడు దుకాణానికి నాంది పలుకు ' అన్నాడు తిరపతయ్య.

తమ్ముడు నాంది వాచకం పలికాడు. దేశం లో ' బోడిగుండు' తాతయ్య ల ఫోటో లు వెతికి వెతికి పాపులర్ అయిన బోడిగుండు తాతయ్యని సూపెర్ మెగా లెవెల్ లో సెంటర్ లో పెట్టి 'తిరపతయ్య బోడిగుండు దుకాణం కనీ వినీ ఎరుగని తీరులో ప్రారంబించాడు.

ఇసుక వేస్తె రాలని జనం 'రంభోత్సవానికి' వస్తే - తస్స దియ్య ఇంత మంది బోడి గుండు కొట్టు కోవడానికి వేచి ఉండడం అతనికి కంట నీళ్ళు తెప్పించింది. 'అనాధ భాష్పాలు ' చూసి జనాలు కూడా ' ఆ హా మాకు బోడిగుండు కొట్టే దానికి కొత్త దుకాణం తయార్ ' అని కంట నీళ్ళు చిందించారు.

(మిగతా రెండో భాగం లో )

చీర్స్
జిలేబి.

3 comments:

  1. కథ చాలా బాగుంది. కొనసాగించండి!

    ReplyDelete
  2. :)).మీ తిరుపతయ్య కధ రెండో భాగం కోసరం వెయిటింగు మరి

    ReplyDelete